పాతబస్తీలో ఫోన్ త్రిబుల్ తలాక్ కేసు ఒకటి వెలుగు చూసింది. పాతబస్తీకి చెందిన సభా ఫాతిమా అనే యువతికి ఐదేళ్ల క్రితం సోమాలియా వాసితో వివాహం జరిగింది. కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్న అతడు.. ఆరు నెలలకు ఒక సారి హైదరబాద్ వచ్చి వెళ్తున్నాడు. అయితే రెండు నెలల క్రితం ఆమెకు ఫోన్ చేసిన అతడు.. ట్రిపుల్ తలాక్ చెప్పేసి పెట్టేశాడు. యువతి మళ్లీ ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా నంబర్‌ను బ్లాక్ చేశాడు. ఈ మేరకు స్థానిక పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ట్రిపుల్ తలాక్ చెప్పిన తన భర్తపై చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను సభా ఫాతిమా ఆశ్రయించింది. ఇక ఇదే అంశం మీద దుబాయ్‌లో ఉన్న అత్త, లండన్ లో ఉన్న వలి సోదరికి ఫోన్ చేసి వివరించగా… కారణమేంటో కనుక్కుంటామని చెప్పి… వాళ్లు కూడా ఫోన్ నంబర్ బ్లాక్ చేశారని బాధితురాలు పేర్కొంటోంది. తలాక్ కు సంబంధించి పత్రాలు కూడా లేనందున తాను మరో పెళ్లి కూడా చేసుకోలేనని ఆమె చెబుతోంది.