త్రివిక్రమ్ డైలాగులు బాలయ్య చెబితే థియేటర్లు దద్దరిల్లల్సిందే..!! 

-

‘అల వైకుంఠపురములో’ ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజైన ఈ సినిమా పండుగకు వచ్చిన అన్ని సినిమాల కంటే మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టిస్తోంది. దీంతో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా పై ఇండస్ట్రీలో మరియు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Image result for trivikram balakrishna"

ప్రస్తుతం ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు గట్టిగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను కూడా త్రివిక్రమ్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

 

ఇదిలా ఉండగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో నందమూరి బాలకృష్ణ ని నటింపజేయడానికి త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు…బాలయ్య బాబు ఓకే అయితే ఎన్టీఆర్ కి తండ్రి పాత్రలో నందమూరి బాలయ్య బాబు ని త్రివిక్రమ్ చూపించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి బాలయ్య త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ తో చేయటానికి ఓకే అంటే మాత్రం బాలయ్య బాబు చెప్పే త్రివిక్రం డైలాగులు సినిమా హాల్లో నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడం గ్యారెంటీ. 

 

Read more RELATED
Recommended to you

Latest news