‘అల వైకుంఠపురంలో’ సినిమా కోసం తెలుగునాట ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు . అల్లూ అర్జున్ – బన్నీ ల కాంబినేషన్ మాత్రమే కాకుండా సంక్రాంతి బరిలో మహేశ్ బాబు తో పోటీగా నిలుస్తున్న సినిమా అవ్వడం బాగా కలిసొచ్చే అంశం అనే చెప్పాలి. తమన్ ఇచ్చిన పాటలు ఇప్పటికే ప్రతీ ఇంట్లో తెగ మొగుతున్నాయి. మరో పక్క టీజర్ కూడా యూట్యూబ్ లో రికార్డులు సెట్ చేస్తోంది.
ఈ నేపధ్యం లో హైదారాబాద్ లోని మ్యూజికల్ కన్సర్ట్ కి వేలాది మంది జనం ఎగబడ్డం తో ట్రాఫిక్ కూడా స్తంభించింది. మ్యూజికల్ ప్రోగ్రామ్ ఆధ్యంతం తమన్ స్టయిల్ లో గ్రాండ్ గా సాగింది. ఒకప్పుడు సినిమాలకి ఆడియో వేడుకలు చేసేవారు ఆ తరవాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ లు వచ్చేశాయి వాటిని తలదన్నుతూ బన్నీ కొత్త ట్రెండ్ తో మ్యూజికల్ నైట్ ప్లాన్ చేశాడు.
అల్లూ అర్జున్ ఫాన్స్ పోటెత్తడం తో హైదరబాద్ లోని యూసఫ్ గూడా గ్రౌండ్స్ అస్సలు సరిపోలేదు. ముఖ్యంగా వేదికపై వస్తున్నా సాంగులకు గ్రౌండ్ లో నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో డైరెక్టర్ త్రివిక్రమ్ ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ గ్రౌండ్ లో ఎంటర్ అవడం తో నే స్టేజ్ పైకి ఎక్కి డాన్స్ వేస్తున్న ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ తో ఆడి పాడటం జరిగింది. మొత్తం మీద గ్రౌండ్ లో అలా వైకుంఠపురం లో మ్యూజికల్ కన్సర్ట్ వేడుకకి పాటలకి మంచి రెస్పాన్స్ వస్తుంది.