రాజమౌళి గురించి పండగ చేసుకుంటున్న త్రివిక్రమ్…!

-

స్టార్ హీరోలతో సినిమా చెయ్యడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ సినిమా కోసం చాలా కష్టపడాలి. చిన్న తేడా వచ్చినా సరే అభిమానుల తిట్లు తినడంతో పాటుగా భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పడతారు. రెండు నెలలు ఆలస్య౦ అయినా సరే మంచి సినిమా ఇవ్వాలని భావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఇదే జరుగుతుంది. రామ్ చరణ్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆలస్యమవుతుంది. దీనికి కారణం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఆలస్యం కావడమే. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆలస్యం కావడంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కలిసి వస్తుంది అంటున్నారు. జూలై తర్వాత తారక్ తో సినిమా చెయ్యాలని భావిస్తున్నాడు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమా ఆలస్యం కావడంతో ఈ సినిమాకు త్రివిక్రమ్ కి మంచి టైం దొరికింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథలను ఎంపిక చేసే పనిలో పడ్డాడు. దీనితో మరో రెండు నెలలు సమయం వరకు దొరికింది. ఈ సమయాన్ని సినిమా కథకు పెడుతున్నాడట. ఇంకా మంచి కథ ఇవ్వొచ్చని భావిస్తున్నాడట. అయితే ‘అల వైకుంఠపురములో’ బిగ్గెస్ట్ హిట్ అందుకోవడం, ఈ సినిమా ప్రమోషన్ కోసం చాలా సమయం వెచ్చించడంతో మాటల మాంత్రికుడు జూనియర్ మూవీ స్క్రిప్ట్‌పై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయాడట. అటు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని కూడా స్వేచ్చగా పూర్తి చేసుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news