టాలీవుడ్ హీరోయిన్ సమంత… విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. అటు తన విడాకులపై నెటిజన్లు కామెంట్లు చేసే అంశంపై కూడా సమంత చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూనే ఉంది.
ఇది ఇలా ఉండగా.. నిన్న ఇన్ స్టా గ్రామ్ లో క్వశ్చన్ అవర్ నిర్వహించింది సామ్. తనను ఎలాంటి క్వశ్చన్స్ ను అడుక్కోవచ్చని పేర్కొంది.ఈ తరుణంలోనే.. ఓ నెటిజన్ ఎవరూ అడగకూడని ప్రశ్న అడిగేశాడు.
”నువ్వు ప్రెగ్నెంటా? కాకపోతే.. నేను నిన్న ప్రెగ్నెంట్ చేస్తా” అని ఇంగ్లీష్ లో కామెంట్ చేశాడు. అయితే.. దీనిపై సమంత చాలా సీరియస్ గానే స్పందించింది. మొదటగా నువ్వు.. ‘reproduce’ అనే పదానికి అర్థం తెలుసుకో.. అసలు ‘reproduce’ అనే పదాన్ని ఎక్కడా వాడుతారో తెలుసుకో అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సమంత. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.