మహిళా క్రికెట్ లో సంచలనం నమోదైంది. అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఇండియన్ బ్యాటర్ గా రిచా ఘోష్ రికార్డ్ క్రియేట్ చేసింది. న్యూజిలాండ్ తో న్యూజిలాండ్ వేదికగా జరిగిన నాలుగో వన్ డేలో ఈ రికార్డ్ క్రియేట్ చేసింది రిచా ఘోష్. 18 ఏళ్ల రిచా ఘోష్ కేవలం 26 బాల్స్ లోనే 50 పరుగులు చేసింది. టోటల్ గా 29 బంతుల్లో 52 పరుగులు చేసింది. ఇందులో నాలుగు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ లో రిచా ఘోష్ చెలరేగి ఆడినా.. భారత్ కు విజయం దక్కలేదు. వర్షం కారణంగా కేవలం 20 ఓవర్ల మ్యాచుగా కుదించారు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది. భారత్ మాత్రం 128 పరుగులకే ఆల్ అవుట్ అయింది. కేవలం రిచా ఘోష్ తప్పితే పెద్దగా ఎవరూ ఆకట్టుకోలేదు. 4.4 ఓవర్లలో 19/4 స్కోర్ ఉన్నప్పుడు.. రిచా ఘోష్ అద్భుత ఇన్నింగ్స్ అడింది. అయితే తన ఇన్నింగ్స్ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయింది.
ఉమెన్ క్రికెట్ లో సంచలనం… ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసి రికార్డ్ సృష్టించిన రిచా ఘోష్
By Advik
-