”బుల్లెట్ బండి” పాటకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య స్టెప్పులు

నీ బుల్లెట్లు బండెక్కి వచ్చేస్తా వా… డుగ్గు.. డుగ్గు.. డుగ్గు అనే పాట సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పెళ్లి కూతిరి డ్యాన్స్‌ తో వైరల్‌ అయిన ఈ పాట ఓ సంచలనం సృష్టించింది. దీంతో చిన్న చిన్న యూ ట్యూబ్‌ ఛానల్స్‌ లోనూ ఊహించని వ్యూస్‌ వస్తున్నాయి. ఫేస్‌ బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ ఎక్కడ చూసినా.. ఇదే పాట వినిపిస్తోంది. ఈ పాట చాలా మంది డాన్స్‌లు చేస్తున్నారు.

అయితే.. తాజాగా ఈ పాటకు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య కూడా స్టెప్పులు వేశారు. ఇప్పుడు ట్రేండింగ్ లో ఉన్న బుల్లెట్ బండి పాటకు చిన్నారులతో కలిసి స్టేప్పులేశారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు డాన్సు వేస్తుంటే బుల్లెట్ పాట రాగానే స్టేజ్ పైకి వెళ్లి చిన్నారులతో కలసి బుల్లెట్ బండి పాటకు స్టేప్పలు వేశారు తాటికొండ రాజయ్య. ప్రస్తుతం రాజయ్య చేసిన డాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.