ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఏదైనా ముఖ్యమైనా అంశం ఉంటే అది కచ్చితంగా మంత్రి వర్గ విస్తరణే అని చెప్పాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు గడుస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీలో మంత్రి వర్గ విస్తరణ పెద్ద ఎత్తున కలకలకం రేపుతోంది. ఇక ఎలాగైనా రెండో దఫాలో మంత్రి పదవి కొట్టేయాలని చాలామంది ఎమ్మెల్యేలా నానా ప్రయత్నాలు అలాగే రాయబారాలు చేస్తున్నట్టు సమాచారం. ఇంకా కొందరు ఎమ్మెల్యేలు అయితే తమకు మంత్రి పదవులు ఇప్పిస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ అధిష్టానానికి వినతులు సమర్పిస్తున్నారంట.
ఇక ఇదేక్రమంలో ఒక ఇద్దరి పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అయితే వీరి పేర్ల వెనక ఓ కొత్త వ్యూహం కూడా ఉందని తెలుస్తోంది. ఈ ఇద్దరూ కూడా పవన్ ను ఓడించిన వారే కావడం గమనార్హం. అదేనండి భీమవరం తో పాటు గాజువాక నియోజకవర్గాల్లో పవన్ పోటీ చేయగా ఆయన్ను ఓడించిన వైసీపీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్ అలాగే తిప్పల నాగిరెడ్డిలు. ఇందులో ఈ రెండు నియోజకవర్గాల్లో కాపులు ఎక్కువగా ఉండటంతోనే ఆయన ఇక్కడ పోటీ చేసినట్టు తెలుస్తోంది.
కాగా భీమవరంలో వైసీపీ నుంచి గ్రంధి శ్రీనివాస్ పోటీ చేసి దాదాపుగా 3900 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం పెద్ద విషయమే అనిచెప్పాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా కాపు ఓట్లు ఉంటాయి. పైగా పవన్‌ది కూడా పశ్చిమగోదావరి జిల్లా కావడంతో ఆయనకు బాగా కలిసివచ్చే అంశం. అయితే గాజువాకలో కూడా తిప్పల నాగిరెడ్డి దాదాపుగా 4 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తే మళ్లీ ఎన్నికలోల పవన్‌కు చెక్ పెట్టినట్టు అవుతుందని జగన్ భావిస్తున్నారంట. మరీ ముఖ్యంగా భీమవరంలో గెలిచిన ఎమ్మెల్యే పేరే బలంగా వినిపించడం గమనార్హం.