ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తాం – బీజేపీకి కేసీఆర్ వార్నింగ్‌

-

ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం పై… టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు యుద్దాన్ని ప్రకటించారు. ఎల్లుండి అంటే నవంబర్‌ 18 వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నాలు నిర్వహిస్తామని… ఈ ధర్నాలు ఇందిరా పార్క్‌ దగ్గర ధర్నా చేసి తీరుతామని స్పష్టం చేశారు.

KCR-TRS
KCR-TRS

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతులు ధర్నాలో పాల్గొని పంట కొనుగోలుకు కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తామని… ధర్నా అనంతరం… తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ కు వినతి పత్రం ఇస్తామని స్పష్టం చేశారు కేసీఆర్. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా ఎల్లుండి ధర్నాలు చేయడమే కాకుండా… వరి ధాన్యం కొనుగోలు పై ప్రధాని మోడీకి, వ్యవసాయ మంత్రికి లేఖలు రాస్తామన్నారు. తాము తెలంగాణ వాదులమని… బీజేపీ పార్టీని వెంటాడుతాం..వేటాడుతామని వార్నింగ్‌ ఇచ్చారు కేసీఆర్‌. వడ్లు కొనే వరకు విడిచి పెట్టబోమని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news