కారులో వారికి సీట్లు ఫిక్స్?

-

వచ్చే ఎన్నికల్లో మరొకసారి గెలిచి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండోసారి అధికారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. అయితే టీఆర్ఎస్‌కు ఈ సారి అంత ఈజీగా గెలవడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఒక వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీలు టీఆర్ఎస్‌కు ధీటుగా పనిచేస్తున్నాయి. పైగా టీఆర్ఎస్‌లో పలువురు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు.

TRS-Party | టీఆర్ఎస్

ఇక వారిని నెక్స్ట్ తప్పనిసరిగా మార్చాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ వెళ్ళినట్లు సమాచారం. వారికి నెక్స్ట్ సీట్లు దొరకడం కష్టమని తెలుస్తోంది. ఇదే క్రమంలో కొందరు ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గానే ఉన్నారని చెప్పొచ్చు. అలాంటి ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు ఫిక్స్ అయిపోయినట్లే అని తెలుస్తోంది. మళ్ళీ సీటు ఇస్తే వాళ్ళు గెలుపు ఈజీ అని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుందట.

ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో కొందరికి దాదాపు సీట్లు ఖాయమైపోయాయని తెలుస్తోంది. మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి దాదాపు సీటు ఫిక్స్ అట. ఒకవేళ ఆమె గాని పోటీ నుంచి తప్పుకుంటే, ఆమె తనయుడు కార్తీక్‌కు సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి సైతం సీటు ఫిక్స్ అని తెలుస్తోంది. ఈయన నిత్యం జనంలోనే ఉంటున్నారు. అలాగే వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్‌కు, తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికు కూడా సీట్లు ఖరారు అయిపోయినట్లే అని చెప్పొచ్చు.

తాండూరులో ఎలాగో సీనియర్ నేత పట్నం మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి రోహిత్‌కు లైన్ క్లియర్. రాజేంద్రనగర్‌లో ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ, కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్‌లో వివేకానంద, మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావు, మేడ్చల్‌లో మల్లారెడ్డిలకు సీట్లు దాదాపు ఖాయమే అని తెలుస్తోంది. మొత్తానికి ఈ రంగారెడ్డి కారు ఎమ్మెల్యేలకు సీట్లు ఫిక్స్ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version