ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎఫ్ సీ ఐ విధానం సరిగా లేదని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. తెలంగాణపై ఎఫ్‌సీఐ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. సింగరేణిలోని బ్లాక్స్ వేలం వేయటాన్ని సింగరేణి తరఫున, తెరాస పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పువ్వాడ అజయ్ అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని, టీఆర్ఎస్ విజయానికి సహాయపడినవారందరికి ధన్యవాదాలు తెలియజేశారు. తాతా మధుకి విజయంతో ప్రతిపక్షాలకు సమాధానం ఇస్తామని అన్నారు. అలాంటి ఇలాంటి మెజారిటీ కాాదు.. భారీ మెజారిటీలో విజయం సాధిస్తామని అన్నారు. ఏ క్రాసింగ్ అయినా.. క్రాస్ బ్రీడ్ అయినా వస్తుంటాయ్ .. పోతుంటాయ్.. మాది అంతా ఒరిజినల్ బ్రీడ్. టీఆర్ఎస్ అంటేనే ఒరిజినల్ బ్రీడ్ అని ఆయన అన్నరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విాజయం పట్ల మాలో ఎలాంటి అభద్రతా భావం లేదు అని ఆయన అన్నారు.