బ్రిటీష్ వాళ్ల కంటే దారుణంగా పాలిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. వరి ధాన్యం వేసిన రైతులు నష్టపోతున్నారని… రైతులు పంట వేయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాను.. జగన్ ఏం చేస్తున్నారు అని నిలదీశారు. తెలుగు దేశం పార్టీ ఒక్కటే పోరాడటం కాదని… ప్రజల్లోనూ చైతన్యం రావాలన్నారు. విభజన హామీలు ఒక్కటైనా సాధించారా?? పేద వాళ్ళ రక్తాన్ని తాగే ప్రభుత్వం ఇది అంటూ వైసీపీ ఫైర్ అయ్యారు. ఓటీఎస్ పేరు తో బెదిరింపులు చేస్తున్నారని….దమ్ముంటే నాతో రావాలి… నిరూపిస్తానంటూ సవాల్ విసిరారు.
వైసీపీ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తోందని… అవకాశవాద రాజకీయం చేస్తుందని ఆగ్రహించారు. ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలని.. రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రం నష్టపోతుందని అనేక పార్టీలు పోరాడాయన్నారు. 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకుని వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారని.. గుర్తు చేశారు. బీజేపీకి రాజ్య సభలో మెజార్టీ లేదు.. అయినా వైసీపీ ఎందుకు సహకరిస్తోంది? అని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని కేంద్రం చెప్పినా వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారన్నారు.