జాక్‌ఫాట్‌ కొట్టిన ట్రక్కు డ్రైవర్‌.. లాటరీ టికెట్‌తో ఊహించని సొమ్ము.!

-

మనలో టాలెంట్‌ ఉంటే…ఏదో ఒక రోజు ప్రపంచం అది గుర్తిస్తుంది. దశ మారిపోతుంది. అదే లక్‌ ఉంటే..లైఫ్‌ యూటర్న్‌ తీసుకున్నట్లే..పాపం కొందరు ఎంత కష్టపడినా ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారు. మరికొందరు ఈజీగా పైసల్‌ సంపాదిస్తేరు. డబ్బు సంపాదించాలంటే..ఉండాల్సింది కష్టపడే తత్వం మాత్రమే కాదు..కాసింత లక్‌ కూడా..! అదృష్టం మన సైడ్‌ లేదంటే…మీరు ఏంచేసినా పెద్దగా లాభం ఉండదు..ఇక్కడ ఒక ట్రక్ డ్రైవర్‌కు అదృష్టం తుమ్మబంకలా పట్టింది. లాటరీ టికెట్‌తో కోట్లకు పడగెత్తాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇల్లినాయిస్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోజంతా ట్రక్కు నడిపేవాడు. ఇటీవల మిచిగన్‌లో ‘స్క్రాచ్-ఆఫ్ లాటరీ’ టికెట్‌ను కొనుగోలు చేశాడు. మనం అప్పుడప్పుడు తీసుకుంటాం కానీ..మనకు అసలు ఏం రావనుకో..మనోడు కూడా హా వచ్చినప్పుడు సంగతిలే అనుకుని చాలా లైట్‌ తీసుకుని నిరాశతోనే టికెట్‌ కొన్నాడు.
మట్టవాన్‌లోని ఓ గ్యాస్ స్టేషన్‌లో అతడు ఆ లాటరి టికెట్‌ను కొని..అక్కడే బార్ కోడ్‌ను స్క్రాచ్ చేశాడు. దీంతో అతడి మొబైల్ ఫోన్‌కు ఆ టికెట్‌ను క్లెయిమ్ చేసుకోవాలంటూ మెసేజ్ వచ్చింది. తనకు సుమారు 2 వేల డాలర్లలో ఏదో ఒక చిన్న మొత్తం లభించి ఉంటుందిలే అనుకున్నాడట.. కానీ, లాటరీ అధికారులు అతడికి ఫోన్ చేసి మీరు.. రూ.7.9 కోట్లు గెలుచుకున్నారని చెప్పారు.అంతే ఫీజులు ఎగిరిపోయాయ్‌…నోటి నుంచి మాట రాలేదు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ..తనకు వచ్చిన డబ్బుతో కొత కొత్త ట్రక్కు కొనుగోలు చేయడానికి కేటాయిస్తాడట… మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో సేవ్ చేసుకుంటాను అన్నాడు. అంత డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకోండి.!
కొంతమంది అదేపనిగా లాటరీ టికెట్‌ తీసుకుంటారు..ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా అదృష్టం మనల్ని వరిస్తుందేమో అని..! కానీ ఎప్పుడో ఒకసారి, ఎవరో ఒక్కరు మాత్రమే ఇలా జాక్‌ఫాట్ కొడతారు..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version