ఒక పక్క కరోనా వైరస్ తో దేశంలో జనాలు చస్తున్నా సరే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం మారడం లేదు. అసలు ఆయనకు కరోనా వైరస్ పెద్ద సమస్య గా కూడా కనపడటం లేదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు నుంచి మానవత్వం లేని వ్యక్తిగా ట్రంప్ గురించి చెప్తూ ఉంటారు. కరోనా తర్వాత ఆయన మాటలు చేష్టలు ఇప్పుడు అదే సంకేతాన్ని ఇస్తున్నాయి అనేది వాస్తవం.
నోటికి ఏది వస్తే అది మాట్లాడే నైజం ఉన్న ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ఆయన సిద్దం కావడం ఆశ్చర్యపరిచింది. వచ్చే వారం నుంచి ఎన్నికల ప్రచారం చేయడానికి ఆయన సిద్దమవుతున్నారు. ఇక తన ఎన్నికల మేనేజర్ మీద కూడా ఏర్పాట్లు సరిగా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే తన క్రేజ్ పడిపోవడం పై కూడా మండిపడ్డారు.
ప్రజల్లోకి తన ఆలోచనలను బలంగా తీసుకుని వెళ్ళడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేసారు. ఇదే కొనసాగిస్తే తాను అమెరికాకు చేసిన సేవను ప్రజలు మర్చిపోయి తనను అధ్యక్ష పదవి నుంచి దింపేస్తారని ఆయన అసహనం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఎన్నికల క్యాంపెయిన్ ని త్వరగా ప్రారంభించడానికి ఆయన సిద్దమవుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో 11 లక్షల మందికి కరోనా రాగా 60 వేల మంది చనిపోయారు. ఇక దేశీయ విమానాలను ఆయన తిప్పడానికి రెడీ అయ్యారు.