అమెరికా ఎన్నికల్లో జో బిడెన్ విజేతగా అధికారికంగా ధృవీకరించబడిన తరువాతే తాను అధ్యక్ష్య అధికారిక భవనం అయిన వైట్ హౌస్ ఖాళీ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ గురువారం నాడు తేల్చి చెప్పారు. తాను ఎప్పుడూ ఓటమిని అంగీకరించలేనని ఆయన తేల్చి చెప్పారు. ట్రంప్ నవంబర్ 3న విడుదల అయిన ఎన్నికల ఫలితాలను ధిక్కరించడానికి ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విలేకరులతో మొదటి సరి ముఖాముఖి ఏర్పాటు చేయగా అందులో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
జనవరి 20 న బిడెన్ ప్రమాణానికి ముందు దాకా తాను పదవిలో పనిచేస్తానని అంగీకరించినట్టు కనిపించారు. ఎలక్టోరల్ కాలేజ్ బిడెన్ విజయాన్ని ధృవీకరిస్తే అతను వైట్ హౌస్ నుండి బయలుదేరుతారా అని అడిగినప్పుడు, ట్రంప్ “ఖచ్చితంగా నేను ఖాళీ చేస్తానని అన్నారు. కానీ “ఎలక్టోరల్ కాలేజ్ అలా చేస్తే, వారు పొరపాటు చేసినట్టే అని ఆయన అన్నారు, అలా అంగీకరించడం చాలా కష్టతరమైన విషయం అని ట్రంప్ పేర్కొన్నారు.