రేపు హైదరాబాద్ రానున్న మోడీ.. కానీ !

-

గ్రేటర్ ఎన్నికల వేడి ఊపందుకుంది. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు హోరాహోరీ పోరాడుతున్నారు. అయితే ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ ఎలా అయినా గ్రేటర్ పీఠాన్ని అధిష్టించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మోడీని సైతం ప్రచారం కోసం రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అయితే ప్రచారం జరిగినట్లు ఆయన హైదరాబాద్ వస్తున్నాడు. కానీ ప్రచారం కొస మాత్రం కాదు. వేరే పని మీద ఆయన హైదరాబాద్ వస్తున్నారు.

కోవిడ్ -19 వ్యాక్సిన్ తయారు చేస్తున్న పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించనున్నట్లు ని  ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్శన అనంతరం మోడీ హైదరాబాద్ రానున్నారు. ప్రధానమంత్రి శనివారం మధ్యాహ్నం హకీంపేట వైమానిక దళ స్టేషన్ వద్దకు చేరుకుని నేరుగా జీనోమ్ వ్యాలీ లోని భారత్ బయోటెక్ కి వెళతారు. అక్కడ భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ కోవిడ్ -19 వ్యాక్సిన్, కోవాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన పనులు జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. టీకా అభివృద్ధి ప్రక్రియను ఒకసారి సిద్ధమైన తర్వాత దాని రోల్‌ అవుట్‌ ప్లాన్ ని అర్థం చేసుకోవడానికి మోడీ ఒక గంట ప్లాంట్‌లో గడుపుతారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. ఆ తర్వాత సాయంత్రం 5.30 గంటలకు నేరుగా ఢిల్లీకి తిరిగి వెళ్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news