నిబంధనలు అతిక్రమించిన ట్రంప్..!

-

గత కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుని డోనాల్డ్ ట్రంప్ సోమవారం వైట్ హౌస్ కి చేరుకున్నారు. ఇక వైట్ హౌస్ లోనే ఐసోలేషన్ లో ఉంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనకు సంబంధించిన వ్యవహారాలను కొనసాగించనున్నారు. అయితే కరోనా కట్టడికి మాస్కులు ధరించాలనే ప్రభుత్వం విధించిన నిబంధనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం పట్టించుకోవడం లేదు. ఐసోలేషన్ నిబంధనలు అతిక్రమించి విధులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

అయితే తాత్కాలిక కార్యాలయం నుంచి పాలనాపరమైన విధులు నిర్వహించేందుకు మంగళవారం నుండే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుముఖత కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నిన్న ఏకంగా ఐసోలేషన్ నిబంధనలను అతిక్రమించి మరి అధికారిక కార్యాలయానికి వెళ్లి పాలనాపరమైన కార్యకలాపాలు చూడటం.. సమావేశం ఏర్పాటు చేయడం ప్రస్తుతం విమర్శలకు దారితీసింది. వెంటనే స్పందించిన ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఇక అటు వెంటనే స్పందించిన వైట్ హౌస్.. మెక్సికోలో ఏర్పడుతున్న తుఫాను పరిస్థితులపై చర్చించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యాలయానికి వచ్చినట్లుగా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news