వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణం రాజుకి సీబీఐ షాకిచ్చింది. హైదరాబాదులో ఆయన ఇంటి మీద సీబిఐ సోదాలు జరుగుతోన్నట్టు చెబుతున్నారు. ఢిల్లీ నుండి వచ్విన సీబిఐ ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేస్తోన్నట్టు చెబుతున్నారు. ఇందు, భారత్ కంపెనీతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ ల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.

ఉదయం ఆరు గంటల నుండే ఈ సోదాలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన నివాసాల పై సీబీఐ సోదాలు కొనసాగుతున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయం మీద ఆయన స్పందిస్తూ నా ఇంట్లో ఎలాంటి ఐటీ సోదాలు జరగడం లేదని అన్నారు. ఐటీ సోదాలు అన్న వార్త మీడియా ద్వారానే తెలుసుకున్నానన్న ఆయన హైదరాబాదులో కానీ ఢిల్లీలో కానీ నీ మా ఇంట్లో ఎలాంటి సోదాలు జరగలేదు అందుకు సంబంధించిన సమాచారం మాకు ఎవరు ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు.