తెలంగాణా ఎంసెట్ : వెబ్ ఆప్షన్ల నమోదు వాయిదా

-

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ కి సంబంధించి కొన్ని మార్పులు చేశారు అధికారులు. దీంతో ఈరోజు జరగాల్సిన వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియను వాయిదా వేశారు. ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సులు, కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఇంకా తేలక పోవడంతో.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఈ మేరకు టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఈ ఆప్షన్స్ నమోదు ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు చేపట్టాలని నిర్ణయించారు.

అలానే ఇంజనీరింగ్‌ మొదటి విడత అలాట్మెంట్‌ను కూడా 24కు వాయిదా వేశారు. కానీ అయితే సర్టిఫికేట్ ల వెరిఫికేషన్ మాత్రం ఈరోజు నుంచి ఈనెల 20 వరకు యథాతథంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన జరగనుండగా దాని కోసం ఇప్పటి వరకు 35, 824 మంది విద్యార్థులు స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. సీట్ అలాట్మెంట్ అనంతరం సీట్లు సాధించిన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 28 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్ చేసి ట్యూషన్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news