విద్యార్థులకు గమనిక.. నేటి నుంచే పాలిసెట్ దరఖాస్తులు..

-

డిప్లొమా, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జూన్‌ 4 వరకు అందుబాటులో ఉండనున్నాయి. జూన్‌ 5 వరకు రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా. జూన్‌ 30న అధికారులు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే పరీక్ష ముగిసిన 12 రోజులకు ఫలితాలను విడుదల చేస్తారు.

TS POLYCET 2021 Exam Date (Announced) - Get Telangana Polytechnic New Exam  Schedule, Registration, Eligibility, Pattern, Admit

పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ద్వారా పాలిటెక్నిక్‌ కాలేజీలతో పాటు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రికల్చర్‌, శ్రీ కొండాలక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ వర్సిటీలో హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సులు, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీలోని యానిమల్‌ హజ్బెండరీ, ఫిషరీస్‌ కోర్సులు, బాసరలోని ఆర్జీయూకేటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (బీటెక్‌) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

వెబ్‌సైట్‌: www.polycet.sbtet.telangana.gov.in, www.polycetts.nic.in

పాలిసెట్‌ ద్వారానే ఆర్జీయూకేటీ ప్రవేశాలు
బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ)లో సీట్లను గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా పాలిసెట్‌ ద్వారానే భర్తీచేయనున్నారు. పాలిసెట్‌ ర్యాంక్‌ల ఆధారంగానే సీట్లను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news