దోశలు పిండి ఇలా చేసుకుని తింటే సూపర్ టేస్ట్.. నార్మల్ వాటికంటే ఎన్నోరెట్లు బెటర్

-

దోశల్లోనే వంద రకాలు ఉన్నాయి.. కానీ అవి అన్నీ.. బియ్యం లేకుండా చేయలేరు. ఆ బియ్యం కూడా పాలిష్ పట్టిన రైస్.. అందువల్లే ఇలాంటి టిఫెన్స్ మంచివి కావని నాచురోపతి వైద్యులు చెప్తుంటారు. మనకు కూడా ఇడ్లీలను హెల్తీగా ఎలా చేయాలో చాలా సార్లు చూశాం కానీ..దోశల పిండిని ఆరోగ్యానికి హాని లేకుండా ఎలా చేయాలో పెద్దగా విని ఉండరు. ఈరోజు మనం బలాన్ని ఇచ్చే పోషకాలతో కూడిన దోశను ఎలా చేయాలో చూద్దాం.

హెల్తీదోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

సగ్గుబియ్యం అరకప్పు
పొట్టుతియ్యని మినపప్పు అరకప్పు
ముడిబియ్యం అరకప్పు
ముడి అటుకులు అరకప్పు
శనగపప్పు టూ టేబుల్ స్పూన్
పెసరపప్పు టూ టేబుల్ స్పూన్స్
కొబ్బరి ముక్కలు టూ టేబుల్ స్పూన్స్
మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా

తయారు చేసే విధానం..

ఒక బౌల్ తీసుకుని అందులో సగ్గుబియ్యం వేసుకుని, పొట్టుతియ్యని మినపప్పు, ముడిబియ్యం, అటుకులు వేసుకుని నీళ్లు పోసి క్లీన్ చేసుకుని 8 గంటలు నానపెట్టుకుని ఆ తర్వాత దోశల పిండిని ఎలా రుబ్బుకుంటారో ఇది అలానే గ్రైండ్ చేసుకుని మూతపెట్టి పక్కన పెట్టండి. మరుసటి రోజు ఉదయానికి పిండి పులుసి డబుల్ అవుతుంది. పొయ్యిమీద గిన్నెపెట్టుకుని అందులో నీళ్లు పోసి పెసరపప్పు, పచ్చిశనగప్పు వేసుకుని పది నిమిషాల పాటు ఉడకనించి నీళ్లు వార్చేసి.. పప్పులను దోశల పిండిలో వేసుకుని అందులోనే మిరియాల పొడి, కరివేపాకు, కొబ్బరిముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి.

ఆవిరిలో ఉడికించుకోవడానికి వీలుగా పొయ్యిమీద ఒక బౌల్ లో నీళ్లు పోసి.. హోల్స్ ఉన్న స్టీల్ ట్రేను పెట్టి దానిపై అరిటిఆకులు వేసి దానిపై దోశలు వలే పోయండి.. ఒక ట్రిప్ కు నాలుగు వరకూ చేసుకోవచ్చు. 15 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. సరిపోతుంది. వీటికి గ్రీన్ చట్నీ లాంటి కాంబినేషన్ చేసుకుని తింటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన దోశలు రెడీ.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news