దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే.ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మే 13న ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్) వాయిదా పడింది.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పరీక్షను విద్యాశాఖ వాయిదా వేసింది.మే 17న పాలిసెట్ జరగాల్సి ఉండగా.. మే 24న నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గత నెలలో పాలిసెట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 22 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే వీలు అవకాశం కల్పించారు.రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 24వరకు, 300 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 26వరకు అప్లై చేసుకునే వీలు ఉందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.