జనసేన బిజెపి నేతల మధ్య విజయవాడ వెస్ట్ సీట్ కాకరేపుతుంది.. నియోజకవర్గ ఇన్చార్జ్ మహేష్ కి టిక్కెట్ ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నారు.. మురుపక్క బీజేపీ నేతలు కూడా తమకే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.. దీంతో రెండు పార్టీల మధ్య టిక్కెట్ గోల రొడ్డుకెక్కింది.. జనసేన బీజేపీ పొత్తు ఆ రెండు పార్టీలకు తలనొప్పిగా మారాయి.. నియోజకవర్గ ఇన్చార్జిల మధ్య మనస్పర్ధలకు అంతర్గత కుమ్ములాట్లకు దారితీస్తున్నాయి..
ఎంతోకాలంగా పార్టీ జెండా మోసిన పోతిన మహేష్ కు టికెట్ రావడం కష్టమని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో మహేష్ జనసేన ని పవన్ కళ్యాణ్ కలిసి తనకు టిక్కెట్ ఇవ్వాలని అభ్యర్థించారట. రెండవ లిస్టులో కచ్చితంగా పేరు ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినప్పటికీ పొత్తుల్లో భాగంగా అది బిజెపికి వెళ్లిందని టాక్కు నియోజకవర్గంలో వినిపిస్తోంది.. దీంతో మహేష్ వర్గం ఆందోళన బాట పట్టింది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు నుంచి మహేష్ ఆయన వెంటే నడుస్తున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి కార్యక్రమం చేపట్టిన మహేష్ ముందుండి మరి దాన్ని విజయవంతం చేశారట.. దీంతో మహేష్ కి టికెట్ కన్ఫర్మ్ అనే భావన ఆయన వర్గంతో పాటు జనసేనలో కూడా ప్రచారం జరిగింది. దానికి తోడు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విజయవాడ అర్బన్ లో జనసేన బలంగా ఉన్న విజయవాడ వెస్ట్ లో ఆ పార్టీకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారనే ప్రచారం జరగడంతో అంచనాల కాస్త పిక్స్ కు చేరాయి.
పొత్తుల్లో భాగంగా తమకే టికెట్ దక్కుతుందని బిజెపి నేతలు స్ట్రాంగ్ గా అభిప్రాయపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ తో పాటు మాజీ అధ్యక్షుడు అబ్బూరి శ్రీరామ్ పోటాపోటీగా అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారట.. మహేష్ కు టికెట్ రాకపోతే మాత్రం ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి