టీఎస్‌ టెట్‌ 2024 ప్రాథమిక కీ విడుదల

-

తెలంగాణలో మే 20వ తేదీన ప్రారంభమైన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీఎస్‌ టెట్‌ 2024) పరీక్షలు జూన్ 2న ముగిశాయి. ఈ పరీక్షలు 10 రోజుల పాటు జరిగాయి. పేపర్‌-1కి 86.03 శాతం మంది..పేపర్‌-2కి 82.58 శాతం మంది హాజరయ్యారు.

జూన్ 3 నుంచి 5వరకు అధికారిక వెబ్ సైట్ లో ప్రాథమిక కీ ఉంటుందని సోమవారం విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెబ్సైట్ లో తెలియజేయాలని టెట్ కన్వీనర్ తెలిపారు. ఈ సంవత్సరం మార్చి 15వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడగా.. పేపర్‌-1కి 99,958 మంది.. పేపర్‌-2కి 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 12వ తేదీన రిజల్ట్స్ వెలువడనున్నాయి. కాగా, 11,062 టీచర్ పోస్టులతో ప్రభుత్వం డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 5089 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషనన్ను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news