MLC కవిత పై సంచలన అభియోగాలు మోపిన ఈడీ..!

-

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల ఎన్ఫోర్స్మెంట్ డై గోరెక్టరేట్ (ఈడీ) సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు దీనిపై సోమవారం విచారణ చేపట్టింది. ఈ సప్లిమెంటరీ ఛార్జీషీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఏ-32గా పేర్కొన్న ఈడీ.. ఆమెపై సంచలన అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత కీ రోల్ పోషించారని ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను కూడా ఆమె ధ్వంసం చేశారని పేర్కొంది.

లిక్కర్ పాలసీ కేసులో విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించాడని, ఈ కేసులో నిందితులైన పిళ్లై, అభిషేక్ నాయర్ హవాలా రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారని ఆరోపణలు చేసింది. క్విక్ బ్యాక్ రూపంలో ఇండో స్పిరిట్స్ రూ.192 కోట్ల లాభాలను పొందిందని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 49 మందిని విచారించి.. 18 మందిని అరెస్ట్ చేశామని తెలిపింది. మొత్తం రూ.224 కోట్ల ఆస్తులు సీజ్ చేసినట్లు ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news