తెలంగాణలో బీజేపీ గెలిచే ఎంపీ సీట్లు ఇవే.. రిజల్ట్స్ కి ముందే చెప్పిన బండి సంజయ్

-

లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. రేపు (మంగళవారం) ఉదయం 8 గంటల నుండి దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే విడుదలై మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ దేశంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చేశాయి. ఇక, తెలంగాణలో మాత్రం అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉంటుందని అంచనా వేశాయి. దీంతో తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందనే దానిపై ఒక స్పష్టత రాలేదు.

ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ గెలవబోయే ఎంపీ సీట్ల సంఖ్యపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ 10 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తోందని జోస్యం చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని అన్నారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ మీద కోపంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బలమైన నాయకత్వాన్ని దేశం మరోసారి కోరుకుంటుందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news