గుడ్ న్యూస్.. ఆ పరీక్షల షెడ్యూల్ అవుట్..!

-

టీఎస్పీఎస్సీ నుండి గుడ్ న్యూస్ వచ్చింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డీఎవోహెచ్డబ్ల్యుఓ పరీక్షల షెడ్యూల్ అయితే వచ్చేసింది 53 పోస్టులతో విడుదలైన డివిజన్ అకౌంట్స్ ఆఫీస్ పరీక్ష జరిగిన పేపర్ లీక్ కావడం తో ఎగ్జామ్ ని రద్దు చేసిన సంగతి మనకి తెలిసిందే. అంతే కాకుండా డిఏఓ పరీక్ష రద్దు అయినప్పటి నుండి ఒక్కసారి కూడా దాని గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు.

TSPSC exams all re-scheduled

తాజాగా పరీక్ష షెడ్యూల్ విడుదలవడంతో నిరుద్యోగుల లో ఆశలు చిగురించాయి డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలు తేదీలని ప్రకటించారు జూన్ 24న హెచ్డబ్ల్యూఓ అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. జూన్ 30న ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షలను నిర్వహించబోతున్నారు పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news