ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం అయినా నాటి నుంచి బస్సుల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు. కొంతమంది మహిళలు అనవసరంగా బస్సులలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. దీంతో రోజు ఉద్యోగానికి వెళ్లే పురుషులు ,కొంతమంది మహిళలకు ఆటంకం కలుగుతుంది.
తాజాగా తెలంగాణ టిఎస్ ఆర్టిసి పురుష ప్రయాణికులకు శుభవార్త అందించింది.ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు ఇకపై టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. పైలట్ ప్రాజెక్టు కింద మెన్ ఎక్స్ క్లూజివ్ సర్వీస్లను నడిపించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఎల్బీ నగర్ – ఇబ్రహీంపట్నం మధ్య ఒక్క బస్సును నడిపిస్తోంది. ఈ బస్సు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30గంటల మధ్య సర్వీసులు అందిస్తోంది. దీనికి వచ్చే స్పందనను బట్టి ఈ మెన్ ఎక్స్ క్లూజివ్ బస్సులను విస్తరించడంపై నిర్ణయం తీసుకోనుంది.