లోక్ సభ ఎన్నికల్లో గట్టిగా పోరాడుదాం -కేసిఆర్

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ చీఫ్ కేసిఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదు అని ఆయన ఆరోపించారు . కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా.. ఉండదా అనేది వాళ్ల చేతుల్లోనే ఉంది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలుపరిచే విధంగా ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహిద్దాం అని తెలిపారు. మరికొన్ని రోజులలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో గట్టిగా పోరాడుదాం అని అన్నారు. అందరితో చర్చించాకే మంచి అభ్యర్థులను ప్రకటిస్తా’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇవాళ శాసనసభ సభ్యుడిగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్ తో స్పీకర్‌  గడ్డం ప్రసాద్‌ ప్రమాణం స్వీకారం చేయించారు. అనంతరం అసెంబ్లీలోని ఎల్డీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కెసిఆర్ బాధ్యతలు స్వీకరించారు.ఈ ప్రమాణస్వీకార  కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుతో పాటు   మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news