టిటిడి రోజుకో కొత్త నిబంధన పెడుతోంది. దీంతో ఈ నిబంధనలతో శ్రీవారి భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.. అలిపిరి నడక మార్గంలో ఉదయం 9 గంటల తరువాత రేపటి రోజు దర్శనం టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే టీటీడీ అనుమతిస్తోంది. అంతే కాక రేపటి రోజున దర్శనం టికెట్లు ఉండి వాహనాలలో వెళ్లే భక్తులను కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాత మాత్రమే టీటీడీ అనుమతిస్తోంది. ఈ సమాచారం తెలియక అలిపిరి వద్ద భారీగా గుమిగూడుతున్నారు భక్తులు.
ఈ క్రమంలో వారిని అదుపు చేయలేక విజిలెన్స్ సిబ్బంది చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. అయితే భక్తులకు ముందస్తు సమాచారం లేకపోవడంతో ఇలా జరుగుతుంది అని చెబుతున్నారు. ఇక ప్రస్తుతానికి అయితే అలిపిరి దగ్గర భారీగా జనాలు ఉన్నారు.. అలాగే వాహనాలు కూడా అక్కడే నిలిచిపోయాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో టీటీడీ ఈ దర్శన సమయానికి 24 గంటలు ముందు అనుమతించే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.