వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై సీఐడీ లేదా విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నేతలు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.
వైసీపీకి లబ్ధి చేకూర్చేలా వారిద్దరూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో తెలిపారు. ఆలయ సంప్రదాయాల మంటగలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీశారనిపేర్కొన్నారు. శ్రీవారి బ్రేక్ దర్శనాలు, టిక్కెట్ల విక్రయాలో అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. అదేవిధంగా తిరుమలలో గెస్ట్ హౌస్ నిర్మాణాల్లోనూ అవకతవకు జరిగాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రభుత్వం ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి అక్రమాలపై సీఐడీ వేస్తుందా లేక విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.