ప్రజా సంక్షేమంలో వైఎస్సార్ అరుదైన ముద్ర వేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా మంగళగిరిలో దివంగత సీఎం వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి రావాలనుకున్నారు. కానీ మణిపూర్ పర్యటనలో ఉన్నందున రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిని శాశ్వతంగా గుర్తు పెట్టుకున్నామంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దారు. ప్రతీ కుటుంబంలో బలమైన ముద్ర వేశారు.
వైఎస్సార్ మరణించి 15 సంవత్సరాలు అయినా ఆయన పకాలు మన మదిలో ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేని లోటు మనందరికీ కనిపిస్తుంది. 2007లో శాసన మండలి సభ్యులుగా ఎన్నికైనప్పుడు శాసన మండలి సమస్యలు వస్తున్నాయని.. వైఎస్సార్ ముందు వినిపించాలని రాత్రి అంతా చదువుకున్నాను. వైఎస్సార్ సీఎంగా తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఎవ్వరైనా సభ్యులు మాట్లాడినప్పుడు వినాలి అని చెప్పే వారు వైఎస్సార్. ప్రజదర్భార్ లో ఎవరు వచ్చినా వారు ఇచ్చే వినతులను తీసుకునేవారు. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేవారు.