తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

-

తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు రాత్రి అంకురార్పణతో ప్రారంభం కానుండగా.. సాధారణ రోజుల్లో కంటే.. ఈ టైంలో భక్తులు రద్దీ మరింతగా ఉండనుంది. దసరా సెలవులు కలసి రావడంతో రద్దీ సాధారణం కంటే అధికంగా ఉండనుంది. ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది.బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఒక్కరోజులోనే దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేశామని, అదే రోజున వాహనసేవల్లో కూడా పాల్గొనవచ్చని ఈఓ శ్యామలరావు తెలిపారు.

వీఐపీ దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు చెప్పారు. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే దర్శనాలు ఉంటాయని, గరుడసేవ రోజున (అక్టోబర్ 8)న వీఐపీ దర్శనాలు ఉండవన్నారు.బ్రహ్మోత్సవాల టైంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం ఆన్ లైన్‌లో 1.32 లక్షల టికెట్లను ఇచ్చామన్నారు. సర్వదర్శనం భక్తుల కోసం రోజుకు 24 వేల టికెట్లను ఇస్తున్నామన్నారు.వాహన సేవల్లో రోజుకు 80 వేల మంది, గరుడవాహన సేవ రోజున లక్షమంది భక్తులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. సుమారు 2 లక్షల మంది ప్రత్యక్షంగా గరుడవాహన సేవను చూసేలా గ్యాలరీలు ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news