TTD : సర్వ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన

-

సర్వదర్శనాలపై టీటీడీ కీలక ప్రకట చేసింది. చిత్తూరు జిల్లాలో పాజిటివ్ రేటు 5 శాతం లోపు వస్తేనే సర్వదర్శనం పున:ప్రారంభిస్తామని ఆలయ ఇఓ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. 10 సంవత్సరాల కాల పరిమితిలో తిరుమలలోని 500 హెక్టార్లలో పవిత్ర మొక్కలను నాటు తామని పేర్కొన్నారు. శ్రీవారి పూజా కైంకర్యాలకు వినియోగించేందుకు 5 ఎకరాలలో పుష్పాలు పండిస్తూన్నామని వెల్లడించారు. అలాగే ఘాట్ రోడ్డులో త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు నడపుతామని చెప్పిన ఆలయ ఇఓ జవహర్ రెడ్డి.. 25 ఎకరాలలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తామన్నారు.

ttd
ttd

ఆగష్టు 15న స్వామివారికి సడలింపు చేసిన పుష్పాలతో అగరబత్తులు తయ్యారిని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా వ్యాక్సినేషన్ పై టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులంతా వ్యాక్సిన్ తీసుకోవాలని అనేకసార్లు చెబుతూ వచ్చిన టీటీడీ..  వ్యాక్సిన్ తీసుకుని వారి విషయంలో కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమైంది. వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు జూన్ నెల జీతాలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 7 లోపు 45 ఏళ్లు దాటిన వాళ్ళు వేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది టిటిడి.

Read more RELATED
Recommended to you

Latest news