తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. శ్రీవారి భక్తులను ఏప్రిల్ రెండో తారీకు నుంచి.. అంటే ఉగాది నుంచి శ్రీవారి ఆలయంలో… అంగ ప్రదక్షణ చేసేందుకు టీటీడీ అనుమతి ఇచ్చింది.. అంగ ప్రదర్శన కోసం ఎప్రిల్ ఒకటో తేదీ నుంచి టోకెన్లను జారీ చేయనుంది టీటీడీ పాలకమండలి.
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా అంగ ప్రదక్షణ టీటీడీ పాలక మండలి రద్దు చేసిన సంగతి తెలిసిందే.. అయితే కరోనా మహమ్మారి కేసులో గత నెల రోజులుగా తగ్గుముఖం పట్టాయి. థర్డ్ వేవ్ కూడా పూర్తయింది.
ఈ నేపథ్యంలోనే అంగ ప్రదర్శన కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీటీడీ. మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆర్జిత సేవలు తిరిగి అనుమతించాలని టిటిడి నిర్ణయించింది. దీంతో భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చేందుకు తహతహలాడుతున్నారు. అయితే.. కరోనా నియమ నిబంధనాలను పాటిస్తూనే.. శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.