500 ఏళ్ల నాటి శివలింగం.. ఎక్కడో కాదు… మన ఆంధ్రాలోనే

-

మన దేశంలో ఉండే ఎన్నో ఆలయాలకు పురాతన చరిత్ర ఉంది. అయితే అలా స్టోరీస్ ఉన్న ఆలాయాలన్నీ ఫేమస్ కాలేదు. కనీసం ఆ చరిత్ర గురించి కూడా చాలామందికి తెలియదు. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబేయో ఓ ప్రదేశం. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాస. ఇక పేరు వినగానే.. అందరికి పలాస సినిమానే గుర్తుకువస్తుంది. పలాస మండలంలోని సవర గోవిందపురం గ్రామంలోనే ఉంది ఓ విశేషం..
సవర గోవిందపురం గ్రామంలో కొండల మధ్య స్వయుంభువుగా వెలసి మహాశివుడు పూజలందుకుంటున్నాడు. 500 ఏళ్ల క్రితం ఈ 30 అడుగుల ఎత్తైన శివలింగాన్ని అప్పటి ప్రజలు గుర్తించారు.

ఆరోజు ఏం జరిగిందంటే..

స్థల పురాణాన్ని అనుసరించి ఒకరోజు తర్లాకోట రాజుకు మహాశివుడు కలలో కనిపించి.. కోట వెనుక కొండల్లో స్వయంభూలింగేశ్వర స్వామిగా వెలసినట్లు చెప్పి అంతర్థానమవుతాడట.. మర్నాడు ఉదయానే ఆ రాజు తన పరివారంతో కొండ ఉన్న ప్రదేశానికి బయల్దేరాడు. కానీ శివలింగం ఎక్కడా కనిపించ లేదు. నిరాశతో వెనుదిరిగారు.. అయితే ఆ రాత్రి శివుడు మళ్లీ రాజుకు స్వప్నంలో కనిపించి తాను చిన్న శివలింగంగా కాకుండా బృహత్‌ రూపంలో ఉన్నట్లుగా చెప్పాడు. దాంతో లింగాకృతిలో ఉన్న కొండను గమనించి రాజు ఆశ్చర్యపోయారు. రాజు పండితులను పిలిపించి శాస్ర్తోక్తంగా పూజలు చేయించాడు.
అప్పటి నుంచి కొండ మీద వెలసిన దేవుడు తమను కాపాడుతున్నారని అక్కడి స్థానికులు చెప్తుంటారు. ఒడిశా సరిహద్దు కావడంతో అక్కడి ప్రజలు కూడా వచ్చి స్వామిని దర్శించుకుని పూజలు చేస్తుంటారు.. ఇక అక్కడ స్వయంభూ లింగానికి తోడు వినాయక, పార్వతిదేవి ఆలయాలను కూడా నిర్మించారు. చుట్టూ పచ్చటి చెట్లతో ఈ ఆలయం ఆధ్యాత్మిక చింతన కలిగించడమే గాక ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుంది. అక్కడికి వెళ్లగానే మంచి డివోషనల్ ఫీల్ వస్తుంది. మనకు ప్రశాంతంగా…ఉంటుంది. సిటీల్లో ఎన్నో శబ్ధాలు, మరెన్నో తలనొప్పుల మధ్య జీవనం సాగించే వారికి.. ఈ ప్రదేశంతు వెళ్లగానే మంచి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. కుదిరితే ఓసారి ఇక్కడు వెళ్లాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version