టీటీడీపీలో ముసలం పుట్టింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నాయకత్వాన్ని సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తోన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన్ని తొలగించాలని ఆయన స్థానంలో వేరే ఎవరినైనా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని మార్చాలని ఇప్పటికే చంద్రబాబును పలువురు సీనియర్లు కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నాయకత్వ మార్పుపై జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖలు రాసినట్టు చెబుతున్నారు.
7 ఏళ్లుగా ఒక్కరే అధ్యక్షుడిగా ఉండటంతో పార్టీ పరిస్థితి దిగజారుతోదంని పలువురు నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తమ జీవితాలతో ఆడుకోవద్దని పలువురు నేతలు బాబుని కోరినట్టు తెలుస్తోంది. నాయకత్వ మార్పు కోరుతూ చంద్రబాబుకు పార్లమెంటు పార్టీ ఇంఛార్జ్ లు, పలువురు నేతలు లేఖ రాసినట్టు చెబుతున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు ఏమి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది.