బీజేపీలోకి దేవేందర్ గౌడ్ ?

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకు ఘోరంగా దిగజారిపోతుంది. ఐదేళ్ల పాటు పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనట్టుగా కేవలం 23 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంది. రెండు దశాబ్దాలుగా అధికారానికి దూరమై పోయిన తెలంగాణలో పరిస్థితి దాదాపు భూస్థాపితం అయ్యే దశకు వచ్చేసింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ మాపారిపోగా.. ఇప్పుడు మరో కీలక నేత సైతం పక్కచూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ తుళ్ళ దేవేందర్ గౌడ్ త్వరలో బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నాయి.

ఆయనతో బిజెపి అగ్ర నాయకత్వం ఇప్పటికే రెండు మూడు దఫాలుగా చర్చలు కూడా జరిగింది. గత జూన్ నెలతో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. అప్పుడే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతారు అని ప్రచారం జరిగింది. దేవేందర్ గౌడ్ రాజకీయంగా కాస్త వెనకబడినా… ఆయన సామాజిక వర్గ పరంగా మాత్రం తనకున్న పట్టును కొనసాగిస్తూ వస్తున్నారు. పార్టీ మారే విషయంలో కొన్ని రోజులుగా తీవ్ర తర్జనభర్జనలు పడుతున్న దేవేందర్‌గౌడ్ తెలంగాణలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోవటం…. అదే టైంలో తెలుగుదేశం అక్కడ భూస్ధాపితం అయిపోవడంతో తనతో పాటు తన కుమారుడు వీరేంద‌ర్ గౌడ్‌కు కూడా రాజకీయ భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి వచ్చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరేందర్ గౌడ్ ఉప్పల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నిక‌ల్లోనూ వీరేంద‌ర్ టీడీపీ త‌ర‌పున చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి మూడో స్థానంతో స‌రిపెట్టుకున్నారు. తెలుగుదేశం తెలంగాణ‌లో బల‌హీనం అయినా వీరేంద‌ర్ మాత్రం వ‌రుస‌గా రెండుసార్లు ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇంకా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగితే ఎప్పటికీ రాజకీయంగా భవిష్యత్తు లేదని గ్రహించిన‌ దేవేందర్ గౌడ్ పార్టీ మారాల‌న్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆయన మధ్యలో పార్టీని వీడినా తిరిగి టిడిపి గూటికి చేరుకున్నారు. చంద్రబాబు ఆయనకు పార్టీ మరి వచ్చాక కూడా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆ కృతజ్ఞతతోనే టిడిపి సీనియర్లు అందరూ ఇతర పార్టీలోకి వెళ్లిపోయినా దేవేందర్ గౌడ్ మాత్రం ఇంకా టీడీపీలో కొనసాగుతూ వచ్చారు ఇక బిజెపి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌ వ‌లలో చిక్కుకొన్న దేవేందర్ గౌడ్ ఫ్యామిలీ ఎట్టకేలకు టిడిపిని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news