ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాక్సిన్‌కు సంబంధించిన ట్రయల్స్ కూడా నడుస్తున్నాయి. తొందరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందంటూ చైనా, రష్యాతోపాటు పలు దేశాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్యూనిషియా కీలక ప్రకటన చేసింది.
పేస్టర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్యూనిస్ డైరెక్టర్ జెనరల్ హెక్‌మి లోయిజర్ కరోనా వ్యాక్సిన్‌పై కీలక విషయం వెల్లడించారు. 2021లోపు కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. డీఎన్ఏ ఆధారంగా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ మనిషిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఆయన వెల్లడించారు. అంటే.. తొందరలోనే కరోనా వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.