పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. వరుసగా నాలుగు రోజుల పాటు క్షీణిస్తున్న బంగారం ధర చూసి గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం బాటలో నడిచిన వెండి ధర మరింత పడిపోయింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 400 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 55,060కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 360 తగ్గడంతో రూ. 50,480కు చేరుకుంది.
అయితే వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ. 700 తగ్గిపోయింది. దీంతో ధర రూ. 67,100కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ.350 మేర తగ్గడంతో రూ.55,600 చేరుకుంది. అలాగే రూ.300 తగ్గుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,000కి దిగొచ్చింది.