కుక్కలపై ప్రేమతో ఏకంగా బంగారు విగ్రహాలు చేయించాడు..!

-

చాలా మంది కుక్కలంటే అమితంగా ఇష్టపడుతారు. కొన్ని సార్లు ‘కుక్కలకుండే విశ్వాసం మనుషులకు కూడా లేదని’ అంటుంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కుక్కకుంటే విశ్వాసం ఎలాంటిదో. మరికొందరైతే వాటిని తమ పిల్లలతో సమానంగా చూసుకుంటారు. అందులోనే వివిధ రకాల జాతులను ఇష్టపడి పెంచుకుంటారు.పెద్ద పెద్ద వ్యాపారాల సంస్థల వద్ద కుక్కలనే కాపాలగా ఉంచుతుంటారు. కుక్కంటే అంత ప్రేమ.

అయితే కుక్కలంటే అమితంగా ఇష్టపడే వారిలో తుర్క్‌మెనిస్థాన్‌ దేశాధినేత గుర్బంగులి బెర్డిముఖమెదోవ్‌ పేరు మొదటగా విన్పిస్తోంది. సెంట్రల్‌ ఆసియాలో నివసించే ‘అలబాయ్‌’ అనే అరుదైన జాతి కుక్కలంటే ఇతగాడికి ఎంతో ఇçష్టం. దీంతో ఆయన ఈ జాతి కుక్కల గుర్తుగా బంగారుతో భారీ కుక్క విగ్రహాన్ని తయారు చేయించి ఆ దేశ రాజధాని యాష్గబట్‌లోని ప్రధాన కూడలిలో ప్రతిష్టించారు.

నేషనల్‌ హాలిడే..

అంతటితో ఆగకుండా అలబాయ్‌ జాతి కుక్కల గౌరవార్థం ఏప్రిల్‌ చివరి ఆదివారాన్ని ‘నేషనల్‌ హాలిడే’గా కూడా ప్రకటించారు. దీంతో పాటు ఈ రోజే గుర్రల జాతిని çగుర్తు చేసుకోవడంతో పాటు అలబాయ్‌ డేను కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవచ్చని గుర్బంగులి బెర్డిముఖమెదోవ్‌ స్పష్టం చేశారు. అంతేగాక ఈదే రోజు ‘‘డాగ్‌ బ్యూటీ అండ్‌ అగ్లీ కాంటెస్ట్‌’’లు నిర్వహించుకుందాని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచంలోనే పాచుర్యం పొందిన జాతులలో పేరొందిని అలబాయ్‌ జాతి శునకం రష్యాతోపాటు, ఇతర మధ్య ఆసియా దేశాలలో కనిíపిస్తాయి. తుర్క్‌మెనిస్థాన్‌లోనే కాకుండా, ఇతరాత్ర దేశాల్లో కూడా కుక్కలు, గుర్రాలను గౌరవించే సాంప్రదాయం ఉంది. ఆయా దేశాల్లో తమ పశుసంపదతోపాటు వీటిని కూడా అపారమైన ప్రేమతో పెంచుతుంటారు. మూడేళ్ల క్రితం గుర్బంగులి, అలబాయ్‌ శునకాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బహుమతిగా అందించాడు. ఆ జాతి కుక్కల మీద ఓ పాట రాసి ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించి ప్రతి కుక్కకి ఓ రోజు వస్తోందని నిరూపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news