నిర్మాత బెల్లంకొండ సురేష్ కేసులో కోర్టు కీలక ఆదేశాలు

-

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ సురేష్‌, ఆయన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. “హౌరా బ్రిడ్జ్” చిత్రాన్ని నిర్మించిన శరణ్ కుమార్…. బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్‌లపై ఫిర్యాదు చేశారు.

అయితే.. నాంపల్లి కోర్టు ఆదేశాలతో వారిపై కేసు నమోదు చేశారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు. సినిమా నిర్మాణం కోసం డబ్బులు అవసరమని 2018 లో మొదట 50 లక్షలు అప్పుగా తీసుకున్న బెల్లంకొండ సురేష్… తరువాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రాబోయే సినిమాలో పార్ట్‌నర్‌ వంటూ నమ్మించి సుమారు 26 లక్షల పైగా నగదు తీసుకున్నాడు.

ఇలా శరన్ నుండి రూ.85లక్షలు తీసుకుని మోసం చేశాడు. తీసుకున్న డబ్బులు ఇవ్వక, అటు సినిమా ప్రొడక్షన్ లో పార్ట్‌నర్ షిప్ ఇవ్వక పోవడంతో కోర్టు ను ఆశ్రయించారు శరణ్. ఈ నేపథ్యంలోనే.. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశారు హైదరాబాద్ సీ సీ ఎస్ పోలీసులు. ఐటీసీ సెక్షన్స్ 406, 417, 420, 120 రెడ్‌ విత్ 156 ఆఫ్ 3 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు…

Read more RELATED
Recommended to you

Latest news