వికారాబాద్ కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్.. కిడ్నాప్ కాదా ?

-

వికారాబాద్‌లో వివాహిత దీపిక కిడ్నాప్ కేసు సంచలనంగా మారింది. విడాకుల కేసు కోర్టులో ఉండగానే భర్త అఖిల్ కు చెందిన కారులోనే గుర్తు తెలియని వ్యక్తులు దీపికను అపహరించుకుపోయారు. కారు ఆమె భర్తదే కావడంతో అతనే కిడ్నాప్‌కు పాల్పడి ఉంటాడనే అనుమానాలు ఉన్నాయి. దీపిక, అఖిల్‌ 2016లో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారని చెబుతున్నారు. ఈ పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో రెండు సంవత్సరాల క్రితమే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు. అయితే కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్‌ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ క్రమంలోనే శనివారం ఇరువురు వికారాబాద్ కోర్టుకు కూడా హాజరయ్యారు. అనంతరం అదే రోజు సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వస్తుండగా ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆ యువతిని కారులోకి లాక్కొని పక్కనున్న ఆమె సోదరిని బయటకు తోసి వెళ్లిపోయారు.దీంతో దీనిపై దీపిక కుటుంబ సభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర మూడు రూట్స్ కు వికారాబాద్ సెంటర్ పాయింట్ కావడంతో హైవే రూట్స్ లో పోలిస్ టీమ్స్ నిన్నటి నుండే జల్లెడ పడుతున్నారు. ఒకవేళ ఇద్దరూ ఇష్టపడి కలిసి వెళ్ళిపోయారా అన్న కోణంలో కూడా దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు. అయితే దీపికను ఎక్కడికి తీసుకెళ్ళాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news