పంజాగుట్ట చిన్నారి మృతి కేసు లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులకు గాంధీ ఆసుపత్రి పోస్ట్ మార్టం నివేదిక అందినట్టు సమాచారం. అయితే పోస్ట్ మార్టం నివేదిక సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. కడుపులో బలంగా కొట్టడంతోనే బాలిక మృతిచెందినట్లుగా పోస్ట్ మార్టం నివేదిక నిర్ధారణ అయ్యింది. ఈ ఘటన రోజు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా నివేదిక అనంతరం హత్య కేసు గా నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ కేసును చేదించడానికి ఐదు స్పెషల్ టీంలు & టాస్క్ ఫోర్స్ ను అధికారులు రంగంలోకి దింపారు. సిసి పుటేజ్ అధారంగా ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఘటన జరిగి రోజులు గడుస్తున్నా చిన్నారి కుటుంబ సభ్యుల వివరాలు తెలియలేదు. దాంతో ఇప్పటికీ చిన్నారి కేసు మిస్టరీ గానే ఉంది. ఘటనా స్థలిలో సీసీ కెమేరాలు లేకపోవడం తో విచారణ కష్టం గా మారింది.