Stylist Pretham: అల్లు అర్జున్ భార్యకు స్టైలిస్ట్‌ ప్రీతమ్ దీపావ‌ళి స‌ర్‌ప్రైజ్ …

-

Stylist Pretham : స్టైలిస్ట్ ప్రీతమ్.. స‌మంత విడాకుల అనంత‌రం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయిన పేరు. ముఖ్యంగా సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఎఫైర్ పెట్టుకుందని… అందుకే నాగచైతన్య సమంత విడిపోయారని రూమర్ వినిపించింది. ఆ క్ర‌మంలో వారిద్ద‌రి ఫోటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అయ్యాయి. త‌న తో పాటు సమంత పై చేస్తున్న ట్రోలింగ్ బాధాకరంగా ఉందని, ఈ విష‌యంలో నాగచైతన్య స్పందించకపోవడం ఇంకా బాధను కలిగిస్తోందని, సమంతను అక్క అని పిలుస్తాను అని చెప్పుకొచ్చారు. అయినా సోషల్ మీడియాలో ట్రోల్స్ త‌ప్ప‌లేదు. అక్కినేని అభిమానుల ఆగ్రహనికి గురికావాల్సి వ‌చ్చింది.

ఇదిలా ఉండగా ప్రీతమ్ మ‌రో సారి వార్త‌ల్లో నిల్చోన్నాడు. సమంత స్టైలిస్ట్‌, డిజైనర్‌గా రకరకాల వైరైటీ దుస్తులను క్రియేట్‌ చేస్తాడు. ఈ దీపావళికి సైతం అదిరిపోయే కలెక్షన్లు రెడీ చేశాడు. తాజాగా.. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డికి కూడా స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీపావళికి ప్రీతమ్ రెడీ చేసిన న్యూ డ్రెస్ నే అల్లు స్నేహ వేసుకుందట. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో స్నేహ షేర్ చేయగా దీనిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఫోటోపై శ్రియా సైతం కామెంట్‌ చేసింది. దానికి శ్రియాకు స్నేహరెడ్డి థ్యాంకు అని రిప్లై ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news