రజనీకాంత్ సింప్లిసిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు ఆయన గురించి తెలిసినవారు! తాను ఒక సూపర్ స్టార్ అన్న విషయం తెరమీద తప్ప మరెక్కడా కనిపించనీయరు రజనీ! బయటకొచ్చినప్పుడు సాధారణంగా సినీ జనాలు చేసే హంగులు, ఆర్భాటాలు ఆయన చేయరనే పేరు రజినీకి ఉంది. ఆ సంగతులు అలా ఉంటే.. తాజాగా రజనీ కారులో చక్కర్లు కొడుతున్న ఒక పిక్ వైరల్ అయ్యింది!
సూపర్‌స్టార్ రజినీకాంత్ తాజాగా ఓ ఖరీదైన కారులో చక్కర్లు కొట్టారు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన కార్ “లంబోర్గిని”! అంత ఖరీదైన కారులో… తెల్ల కుర్తా, పైజామా, మొహానికి మాస్క్ వేసుకుని తనదైన శైలిలో రజినీకాంత్ ఆ కారుని స్వయంగా నడుపుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫొటోను రజినీకాంత్ అభిమానులు ట్విటర్ లో వైరల్ చేస్తున్నారు. “లయిన్ ఇన్ లంబోర్గినీ” అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… తన కూతురు సౌందర్య, ఆమె భర్త, మనవడిని కలవడానికే రజనీ సొంతంగా డ్రైవ్ చేసుకుని వెళ్లారని తెలియజెప్పే ఫోటో కూడా ఈ స్ కూడా వైరల్ అవుతోంది.