జూబ్లీహిల్స్ హిట్ & రన్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్

-

హైదరాబాద్: జూబ్లిహిల్స్ హిట్ & రన్ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇద్దరు నిందితులను రిమాండ్ కి తరలించనున్నారు పోలీసులు. వర్ణ కారు లో యాబై గ్రాముల గంజాయి, గంజాయి నింపిన సిగరెట్లను స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. కారు నడిపిన యువకుడు ముదిగొండ అనుష్ రావు( 23) దిల్ షుక్ నగర్, కారులో మరో యువకుడు పవన్ కళ్యాణ్ రెడ్డీ (కొత్త పేట) ఇద్దరికీ యువకులను అరెస్టు చేశారు.

ఈ ఇద్దరు యువకులు శంషాబాద్ లోని జీఎంఅర్ ఎరినా లో సన్ బర్న్ ఈవెంట్ లో మద్యం సేవించడంతో పాటు గంజాయి సేవించినట్లు గుర్తించారు పోలీసులు. ప్రమాదంలో గాయపడిన అజ్ఞాత్ బేగంపేట్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు నిందితుల రక్త నమూనాలు, వెంట్రుకల నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు జూబ్లీహిల్స్ పోలీసులు. యువకులపై Ndps ఆక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news