అరుణాచల్ ఆర్మీ హెలికాప్టర్‌ ఘటన.. రెండు మృతదేహాలు లభ్యం

-

అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్‌ కూలిన ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న ఐదుగురి కోసం రెస్క్యూ టీమ్స్‌ గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చేపడుతున్నారు.

ప్రమాదం జరిగిన ప్రాంతానికి రోడ్డు మార్గం లేకపోవడంతో అక్కడికి చేరుకోవడం ఇబ్బందిగా మారిందని రెస్క్యూ టీమ్స్ తెలిపాయి. వాయు మార్గాన, లేదంటే వేలాడే వంతెన గుండా నడుచుకుంటూ మాత్రమే అక్కడికి చేరుకునే అవకాశం ఉందని చెప్పాయి. అందువల్ల ఏరియల్‌ రెస్క్యూ టీమ్స్‌  మిగ్‌-17, రెండు ధృవ్‌ హెలికాప్టర్లతో ప్రమాద ప్రాంతానికి వెళ్లాయని స్థానిక అధికారులు వెల్లడించారు.

ఇద్దరు జవాన్‌లు హెలికాప్టర్‌ కూలిన చోటుకు చేరుకుని రెండు మృతదేహాలను గుర్తించారు. ఆ మృతదేహాలను అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఇవాళ ఉదయం 10:43 గంటలకు సియాంగ్‌ జిల్లాలోని మిగ్గింగ్‌ గ్రామానికి సమీపంలో ఆర్మీకి చెందిన అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ కుప్పకూలిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news