ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి మరోసారి తన దర్శక ప్రతిభతో తెలుగు సినిమా ను ప్రపంచ స్థాయిలో నిలిపాడు. ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల స్క్రీనింగ్ అయ్యి ఇతర దేశాల ప్రేక్షకులను అబ్బుర పరిచింది. ఈ సినిమా వల్ల రాజమౌళికి విపరీతంగా ప్రచారం వచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ లతో ప్రస్తుతం జపాన్ లో పర్యటిస్తున్నారు.
కాగా ఈ చిత్రం శుక్రవారం జపాన్‌లో పెద్ద ఎత్తున విడుదల అయ్యింది.ఈ సినిమా కోసం మూడు రోజులు ముందుగానే వచ్చి రాజ మౌళి టీమ్ గట్టిగా ప్రమోషన్స్ చేశారు. శుక్రవారం బుకింగ్స్ కూడా పెద్ద ఎత్తున జరిగాయి. ఇప్పటికే రాంచరణ్, జూ ఎన్టీఆర్ ఇద్దరూ అక్కడి అభిమానుల తో ముచ్చటిస్తున్న వీడియోస్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక్కడొక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ తమ ఆర్ఆర్ఆర్ సినిమా తో హడావుడి చేస్తున్నారు కాని మన సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడో తన సినిమా తో జపాన్ ప్రేక్షకులను అలరించారు. జపాన్‌లో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన సినిమాలలో రజనీకాంత్ సినిమాలు అయిన ‘ముత్తు’, ‘దర్బార్’ లు వున్నాయి.ఎప్పుడో వచ్చిన ‘ముత్తు’ సినిమా జపాన్‌లో ఇప్పటికీ హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాగా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. జపాన్‌లో ఈ సినిమా దాదాపు రూ.26కోట్ల రూపాయల వసూళ్లు తెచ్చి పెట్టింది. ఈ రికార్డ్ ను ఇంత వరకు ఏ ఇండియన్ సినిమా బద్దలు కొట్టలేదు. అది కదా రజని అంటే .