రెజ్లింగ్​లో బజరంగ్​, సాక్షి, దీపక్​కు గోల్డ్​.. అన్షుకు రజతం.. దివ్యకు కాంస్యం

-

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ తొమ్మిదో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మరో స్టార్ రెజ్లర్ దీపక్ పునియా బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. పురుషుల 86 కేజీల ఫైనల్లో పాకిస్థాన్‌కు చెందిన ముహమ్మద్ ఇనామ్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకున్నాడు.

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ మెరిసింది. మహిళల రెజ్లింగ్‌ ఫ్రీస్టైల్‌ 62 కేజీల విభాగంలో సాక్షి మాలిక్‌ పసిడి పట్టేసింది. రెజ్లింగ్‌లో మరో భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా ఫైనల్స్‌లో కెనడా యువ రెజ్లర్‌ మెక్‌నీల్‌పై సునాయాస విజయం సాధించాడు. ఆది నుంచి ప్రత్యర్థులను చిత్తు చేసుకుంటూ వచ్చిన బజ్‌రంగ్ ఫైనల్లోనూ 9-2 తేడాతో మెక్‌నీల్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు. మహిళల 68 కిలోల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌లో భారత క్రీడాకారిణి దివ్య కక్రాన్‌ కాంస్య పతకం సాధించింది.

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ మెరిసింది. మహిళల రెజ్లింగ్‌ ఫ్రీస్టైల్‌ 62 కేజీల విభాగంలో సాక్షి మాలిక్‌ పసిడి పట్టేసింది. ఫైనల్‌లో కెనడాకు చెందిన అనా గోడినెజ్‌ను సాక్షి మట్టికరిపించింది. రెజ్లింగ్‌లో సాక్షి తెచ్చిన పతకంతో కలిపి కామన్వెల్త్‌లో భారత్‌కు ఇది ఎనిమిదో స్వర్ణం. 2014 కామన్వెల్త్‌ క్రీడల్లో సాక్షి రజతం, 2018లో కాంస్యం సాధించగా, తాజాగా స్వర్ణ పతక విజేతగా నిలవడం విశేషం.

రెజ్లర్‌ అన్షుమాలిక్‌ మహిళ 57 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో రజతం కైవసం చేసుకుంది. తుదిపోరులో నైజీరియా రెజ్లర్‌ ఒడునాయో ఫొలాసాడే అడికురో చేతిలో 4-6 తేడాతో ఓటమిపాలైంది. దీంతో కామన్వెల్త్‌ క్రీడల్లో ఆమె తొలి పతకంగా రజతాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం వరుస బౌట్లలో చెలరేగి ఫైనల్‌కు చేరిన అన్షు కీలక పోరులో తడబడింది. అయితే తన పోరాటంతో అన్షు రెజ్లింగ్‌ అభిమానుల మనసులు గెలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version